Advertisementt

రజనీ చిత్రంలో స్పెషల్‌ అట్రాక్షన్‌..!

Tue 22nd Sep 2015 06:59 AM
kabali,rajinikanth,radhika apte,aishwaryarai  రజనీ చిత్రంలో స్పెషల్‌ అట్రాక్షన్‌..!
రజనీ చిత్రంలో స్పెషల్‌ అట్రాక్షన్‌..!
Advertisement
Ads by CJ

సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందతున్న చిత్రం కబాలి. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో ప్రారంభమైంది. ఆ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్స్‌లో రజనీ కేకపుట్టిస్తున్నాడు. కాగా ఇందులో రాధికాఆప్టే కీలకపాత్రను పోషించనుండగా, మరో కీలకపాత్రను ఎవరి చేత చేయించాలా? అని యూనిట్‌ సభ్యులు తలలు బద్దలు కొట్టుకున్నారట. ఎట్టకేలకు ఆ పాత్రను ఐశ్వర్యారాయ్‌ చేస్తే బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ వస్తుందని భావించిన దర్శకనిర్మాతలు తాము అడిగితే ఐశ్వర్యా నో అంటుందని భావించి, స్వయంగా రజనీ చేత ఐశ్వర్యకు ఫోన్‌ చేయించారట. స్వయాన రజనీ అడగటంతో ఐశ్వర్యరాయ్‌ కూడా ఓకే చెప్పిందని కోలీవుడ్‌ సమాచారం. కాగా ఇందులో రజనీకి ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రమే హీరోయిన్‌ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో మలేషియాకు ప్రయాణం కానుంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో థాను నిర్మిస్తున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ