మహేష్‌ లిస్ట్‌లో మరొకరు...!

Tue 22nd Sep 2015 04:17 AM
mahesh babu,vikram k kumar,surya,24 movie  మహేష్‌ లిస్ట్‌లో మరొకరు...!
మహేష్‌ లిస్ట్‌లో మరొకరు...!
Sponsored links

శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మహేష్‌బాబు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మూెత్సవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తర్వాత మహేష్‌ చేయబోయే తదుపరిచిత్రం ఏమిటి? అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వరుసలో పూరీజగన్నాథ్‌, వినాయక్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌ వంటి హేమాహేమీలు లైన్‌లో ఉన్నారు. అయితే తాజాగా మహేష్‌ తాను చిత్రం చేస్తానని మరో దర్శకునికి మాట ఇచ్చాడట. అతనెవ్వరో కాదు... మనం దర్శకుడు విక్రమ్‌.కె. కుమార్‌. ఆయన ప్రస్తుతం సూర్యతో 24 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అతను ఒకసారి మహేష్‌ను కలిసినప్పుడు ఆయనతో సినిమా చేయాలనే కోరికను విక్రమ్‌ వెలిబుచ్చాడట. చూద్దాం.. అన్న మహేష్‌ ఇటీవల విక్రమ్‌ కె.కుమార్‌కు స్వయంగా ఫోన్‌ చేసి నా కోసం ఓ సబ్జెక్ట్‌ రెడీ చేసుకోమని చెప్పాడని విశ్వసనీయ సమాచారం. దీంతో విక్రమ్‌ మహేష్‌ కోసం ఓ వైవిధ్యమైన స్టోరీని తయారు చేసి ఇటీవల మహేష్‌కు వినిపించాడని, దానికి మహేష్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి మహేష్‌ తదుపరి చిత్రం ఎవరితో అనే విషయాన్ని పక్కనపెడితే మహేష్‌ విక్రమ్‌ కె.కుమార్‌తో సినిమా చేయడం మాత్రం ఖాయమైంది. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచిచూడాలి..! 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019