Advertisementt

వేలు పెడుతోన్న అత్తగారు..!

Mon 21st Sep 2015 07:05 AM
nadiya,attharintiki daredi,mirchi,drusyam  వేలు పెడుతోన్న అత్తగారు..!
వేలు పెడుతోన్న అత్తగారు..!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా నటి నదియాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సినిమా అంగీకరించడానికి ఆమె ఎన్నో షరత్తులు పెడుతుందనే కామెంట్లు రావడంతో బజారురౌడీ వంటి ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే ఆమె హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకానీ, ఆ స్టార్‌ స్టేటస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో కీలకపాత్రలను పోషించి మెప్పించింది. నటనాపరంగా ఆమెకు తిరుగులేకపోయినప్పటికీ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటుందనే విమర్శలు మరోసారి మొదలయ్యాయి. తమ సినిమాల్లో చేయమని అడిగిన దర్శకనిర్మాతలను హీరోయిన్ల కంటే ఎక్కువ 

పారితోషికం డిమాండ్‌ చేస్తోందిట. అయితే ఇది పెద్ద విషయం ఏమీ కాదు... ఫామ్‌లో ఉన్న వారు డిమాండ్‌ చేయడం మామూలే. అయితే తన పాత్రను పూర్తిగా విన్న తర్వాత తన పాత్రకు మరింత ప్రాధాన్యం వచ్చేలా... చివరకు హీరోలను కూడా డామినేట్‌ చేసే విధంగా ఆమె మార్పులు చేర్పులు చేయమని ఒత్తిడి తెస్తోంది అనేది ప్రధాన విమర్శ. ఇప్పటికే హీరోల డామినేషన్‌ను తట్టుకోలేక వారికి పూర్తి ప్రాధాన్యం ఇస్తున్న తమకు నదియా మార్పులు చేర్పులు చెప్పే తీరు చూస్తే.. అలా మార్పులు చేర్పులు చేస్తే హీరోల ప్రాధాన్యం కూడా తగ్గిపోయి, నదియానే కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆమెను తీసుకోవాలని భావిస్తున్న పలువురు ఆమెకు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ