Advertisementt

బన్నీని హ్యాండిల్‌ చేయగలడా..?

Sat 19th Sep 2015 06:02 AM
allu arjun,boyapati sreenu,sarainodu movie,thaman  బన్నీని హ్యాండిల్‌ చేయగలడా..?
బన్నీని హ్యాండిల్‌ చేయగలడా..?
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను చిత్రం అంటే అది పక్కా యాక్షన్‌ సబ్జెక్ట్‌తో రక్తపాతాలతో నిండివుంటుంది. మాస్‌ ఇమేజ్‌ విపరీతంగా ఉన్న బాలకృష్ణ అయినా లేక ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్‌ అయినా బోయపాటి తీరు మాత్రం ఒకే స్టైల్‌లో ఉంటుంది. తాజాగా ఆయన అల్లుఅర్జున్‌ హీరోగా సరైనోడు అనే వర్కింగ్‌టైటిల్‌తో ఓ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే బోయపాటికి పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. జులాయి, రేసుగుర్రం చిత్రాలతో కామెడీని, సన్నాఫ్‌ సత్యమూర్తి తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువైన బన్నీని ఆయన ఎలా తెరపై ఆవిష్కరించనున్నాడు? అనేది అందరికీ ఓ ప్రశ్నగా మిగిలింది. ఈ చిత్రం కోసం బోయపాటి మాస్‌ యాక్షన్‌తో పాటు రొమాన్స్‌కు, కామెడీకి పెద్ద పీట వేయనున్నాడు. ఈ రెండు బోయపాటికి పెద్దగా పట్టులేని అంశాలు. ఈచిత్రంలో బన్నీ గెటప్‌ కూడా వెరైటీగా ఉంటుందని సమాచారం. కోరమీసపు కట్టుతో ఆయన బన్నీని తెరపై చూపించనున్నాడు. ఎలాగూ బోయపాటికి అరవింద్‌ సలహాలు, సూచనలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ చిత్రంపై బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. బన్నీకి జతగా రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌లను ఎంచుకున్న బోయపాటి సంగీత బాధ్యతలను తమన్‌ చేతిలో పెట్టాడు. మరి బన్నీ కోసం బోయపాటి చేయబోతున్న ఈ మార్పులు సినిమాను ఎక్కడి తీసుకెళ్లనున్నాయి? అని అందరూ చర్చించుకుంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ