Advertisement

రామ్‌చరణ్‌ విశాల హృదయం..!

Tue 15th Sep 2015 04:34 AM
mahesh babu,sreemanthudu,ram charan,brucelee  రామ్‌చరణ్‌ విశాల హృదయం..!
రామ్‌చరణ్‌ విశాల హృదయం..!
Advertisement

బాహుబలి1 తర్వాత తెలుగులో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రం శ్రీమంతుడు. అప్‌కమింగ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు ఈచిత్రం ఓ టార్గెట్‌ అయింది. ఇప్పుడు అందరి దృష్టి శ్రీమంతుడు రికార్డు మీదనే ఉంది. స్టార్‌హీరోలే కాదు.. స్టార్‌ డైరెక్టర్లు కూడా శ్రీమంతుడు కలెక్షన్లను క్రాస్‌ చేసి తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీమంతుడుతో 100కోట్ల వసూళ్లను దాటిన మహేష్‌బాబును టాలీవుడ్‌ నుండి అభినందించిన ఒకే ఒక్క స్టార్‌హీరో రామ్‌చరణ్‌ మాత్రమే అట...! ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు చెప్పాడు. ఓ ఇంగ్లీషు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో చరణ్‌ మినహా ఇతర హీరోలు ఎవ్వరూ ఫ్రెండ్లీ కాంపిటీషన్‌ను మెయిన్‌టెయిన్‌ చేసి ఎంకరేజ్‌ చేయడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. స్టార్‌హీరోలు ఎవరైనా బిగ్‌ సక్సెస్‌ సాధిస్తే వారిని విష్‌ చేసే పద్దతిని గతంలో మెగాస్టార్‌ చిరంజీవి బాగా ఫాలో అయ్యేవాడు. ప్రస్తుతం ఇదే ఒరవడిని రామ్‌చరణ్‌ కొనసాగించడం అభినందించాల్సిస విషయం. మరి చరణ్‌ కూడా తన రాబోయే బ్రూస్‌లీ ద్వారా శ్రీమంతుడు రికార్డును బద్దలు కొడతాడని మెగాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement