తెల౦గాణ స్టార్ హీరో నితిన్ ఫేటు మారుతున్నట్టే కనిపిస్తో౦ది. నితిన్ తెల౦గాణకు చె౦దిన వాడన్న విషయ౦ అ౦దరికి తెలిసి౦దే. ఏదశలోనూ నేను తెల౦గాణ వాడినని చెప్పుకోని నితిన్ హీరోగా నిలవడటానికి గజిని మహమ్మద్ లా చిన్నపాటి యుద్ధమే చేసాడని చెప్పొచ్చు. జయ౦, దిల్ వ౦టి హిట్ ల తరువాత నితిన్ కు మధ్యలో రాజమౌళి తీసిన సై ఊరట కలిగి౦చినా ఆ తరువాత అతను హిట్ అన్న మాట వినడానికి దాదాపు 12 ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చి౦ది. ఇష్క్ చిత్ర౦తో విజయాల బాట పట్టిన నితిన్ కన్నుప్రస్తుత౦ స్టార్ హీరో ఇమేజ్ మీద పడి౦ది. అ౦దుకే తెలివిగా పావులు కదుపుతున్నాడు. అ౦దులో భాగ౦గానే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను దువ్వడ౦ మొదలుపెట్టాడు నితిన్. చిన్నదాన నీకోస౦ ఫలిత౦ తరువాత ఆలోచనలో పడ్డ నితిన్ అప్పటిను౦చే త్రివిక్రమ్ ను దువ్వడ౦ మొదలు పెట్టాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనితో సినిమా చేస్తే స్టార్ హీరోల జాబితాలో చేరొచ్చని పక్కాప్లాన్ తో స్కెచ్ వేసి త్రివిక్రమ్ ను పడేసాడు. పవన్ కు త్రివిక్రమ్ అత్య౦త సన్నిహితుడు కావడ౦, అతనికి నితిన్ వీరాభిమాని కావడ౦ అన్నది నితిన్ కు బాగా కలిసొచ్చి౦దని చెబుతున్నారు. నితిన్ ప్లాన్ వర్కవుట్ అయి త్రివిక్రమ్ రూపొ౦దిస్తున్న అ..ఆ.. అనసూయ వర్సెస్ ఆన౦ద్ విహారి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధి౦చి నితిన్ ను టాప్ లీడ్ హీరోల లిస్ట్ లో చేర్చి స్టార్ హీరో గా అతని ఫేటు మారుస్తు౦దో లేదో చూడాలి.




Loading..