Advertisementt

బావతో కలిసి నటించనంటున్న మరదలు.!

Wed 09th Sep 2015 04:27 AM
heroine shamili,heroine shalini sister shamili,shamili with dhanush,shamili with vikram prabhu,shamili about ajith  బావతో కలిసి నటించనంటున్న మరదలు.!
బావతో కలిసి నటించనంటున్న మరదలు.!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న షాలిని ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లో సఖి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ్‌ హీరో అజిత్‌ని పెళ్ళి చేసుకొని సెటిల్‌ అయిన షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. బాలనటిగా షాలిని కంటే ఎక్కువ పేరు సంపాదించుకుంది ఆమె చెల్లెలు షామిలి. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన షామిలి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ఓయ్‌. ఆ తర్వాత మళ్ళీ సినిమాల జోలికి రాని షామిలి లేటెస్ట్‌గా తమిళ్‌లో ధనుష్‌తో ఒక సినిమా, విక్రమ్‌ ప్రభుతో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో వున్నాయి. 

కొంత గ్యాప్‌ తీసుకొని హీరోయిన్‌గా మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న షామిలిని.. మీ బావ అజిత్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బావ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఉద్దేశం తనకు లేదని, అవసరమైతే బావ సినిమాలో ఏదైనా స్పెషల్‌ రోల్‌ చేస్తాను తప్ప హీరోయిన్‌గా కాదు అని స్పష్టం చేసింది షామిలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ