Advertisement

వినాయకచవితికి బ్రూస్ లీ స్పెషల్!

Sun 06th Sep 2015 03:27 AM
brucelee movie,ram charan,srinuvaitla,kona venkat  వినాయకచవితికి బ్రూస్ లీ స్పెషల్!
వినాయకచవితికి బ్రూస్ లీ స్పెషల్!
Advertisement

ఇప్పటికే యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ టీజర్స్‌ను విడుదల చేసిన బ్రూస్‌లీ సినిమా టీం త్వరలో మూడో టీజర్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్‌లో కోనవెంకట్‌, గోపీమోహన్‌లు పని చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంలో కామెడీకి పెద్ద పీట వేయడం ఖాయమని తెలిసిందే. కాగా యాక్షన్‌ టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే కానుకగా, ఫ్యామిలీ సెంటిమెంట్‌ టీజర్‌ను బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే సందర్బంగా విడుదల చేసిన బ్రూస్‌లీ టీం రాబోయే వినాయక చవితి పండగ సందర్బంగా కామెడీ టీజర్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఈ విషయమై రచయిత కోనవెంకట్‌ మాట్లాడుతూ... ఇప్పటివరకు యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ టీజర్స్‌తో సినిమాలోని ఈ రెండు అంశాలు ఎలా ఉండనుందనేది తెలియజేశాం. త్వరలోనే ఓ కామెడీ టీజర్‌తో మిమ్మల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాం అని తెలిపాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement