మెగా డాటర్ కు గ్రీన్ సిగ్నల్...!

Sat 05th Sep 2015 10:05 AM
Advertisement
niharika,nagababu,anjana productions,tv shows  మెగా డాటర్ కు గ్రీన్ సిగ్నల్...!
మెగా డాటర్ కు గ్రీన్ సిగ్నల్...!
Advertisement

మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. అప్పట్లో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా డి-7 యాంకర్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాంకరింగ్‌తో, బబ్లీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్‌ అంటూ కితాబిస్తున్నారు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుండి సినిమా హీరోయిన్‌ కూడా రాబోతోందనే సంకేతాలు నిహారిక జోరు చూస్తుంటే స్పష్టమవుతోందనే ప్రచారం మొదలైంది. నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నాగబాబు ఇప్పటికే ఆమెకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఇప్పటికే పలువురు నిర్మాతలు నాగబాబును కలిసి నిహారికను లాంచ్‌ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్‌. అయితే ఏ విషయమైనా నిహారికాకే వదిలేస్తున్నాను. ఆమెను ఇది చెయ్‌.. ఇది చెయ్మోద్దు... అని బలవంతం పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని, నిహారికి సినిమాల్లోకి వస్తే గైడ్‌గా ఉంటాను అని నాగబాబు నిర్మాతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే నిహారిక మాత్రం తన తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమాలు, టీవీ సీరియల్స్‌, రియాల్టీ షోలు చేస్తూ నిర్మాతగా మారడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు మరి కొందరు అంటున్నారు. ఏ విషయం త్వరలోనే తేలిపోతుందని టాక్‌....! 

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement