Advertisementt

సురేష్ బాబు చేతిలో తేజ ఫ్యూచర్!

Tue 25th Aug 2015 06:44 AM
horahori,teja,suresh babu,damodar prasad,uyyala jampala  సురేష్ బాబు చేతిలో తేజ ఫ్యూచర్!
సురేష్ బాబు చేతిలో తేజ ఫ్యూచర్!
Advertisement
Ads by CJ

కెరీర్‌ మొదట్లో తన చిత్రాల ద్వారా టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన దర్శకుడు తేజ. తక్కువబడ్జెట్‌తో కొత్తవారిని ఎక్కువగా పరిచయం చేస్తూ ఆయన తీసిన అనేక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు నమోదు చేశాయి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం తేజ తీసిన చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలుస్తూ వస్తున్నాయి. దాంతో ఆయన పేరు త్వరితగతిన మరుగున పడుతూ వస్తోంది. అయితే ఆయన తాజాగా తీసిన 'హోరాహోరీ' సినిమా మాత్రం అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రాన్ని తేజ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసిపెట్టమని తేజతో పాటు ఈ చిత్ర నిర్మాత దామోదర ప్రసాద్‌లు ఇటీవల సురేష్‌ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌బాబును కలిశారని సమాచారం. సాధారణంగా ఇలా ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేసి పెట్టమని వచ్చే చిన్న చిత్రాలను తనకు నచ్చితే ఏకంగా డిస్ట్రిబ్యూషనే కాదు.. అందులో భాగస్వామిగా చేరి తనవంతు లాభాలను పొందడంలో సురేష్‌బాబు సిద్దహస్తుడు. కాగా ఆయన గతంలో 'ఉయ్యాల జంపాల' చిత్రం మాదిరే ఈ చిత్రాన్ని చూసి చాలా బాగుందని ఫీలయిన సురేష్‌బాబు ఈ చిత్రంలో పార్ట్‌నర్‌గా మారాడని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రంపై తేజ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం దర్శకునిగా తనకు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తుందనే ఆశతో తేజ ఉన్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ