Advertisementt

ట్రెండ్‌ మొదలైంది!

Sat 22nd Aug 2015 05:46 AM
bahubali,sreemanthudu,ma nannaku prematho,ntr  ట్రెండ్‌ మొదలైంది!
ట్రెండ్‌ మొదలైంది!
Advertisement
Ads by CJ

'బాహుబలి1' చిత్రం ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా విడుదలైన మహేష్‌బాబు 'శ్రీమంతుడు' కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే రోజున విడుదలైంది. దీంతో త్వరలో రాబోయే 'రుద్రమదేవి' చిత్రమే కాదు.. ఎన్టీఆర్‌ -సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'మా నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని కూడా ఒకే సారి తెలుగు, తమిళంలో జనవరి 8న విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. తమిళంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పాత్రలకు తమిళంలో గుర్తింపు ఉన్న నటులను సినిమాలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సో.. త్వరలో ఎన్టీఆర్‌ తమిళంలో కూడా రెచ్చిపోనున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ