Advertisementt

మహేష్‌.. దారిలోనే రవితేజ కూడా!

Thu 20th Aug 2015 02:32 AM
raviteja,kick 2,mahesh babu,srimanthudu,media  మహేష్‌.. దారిలోనే రవితేజ కూడా!
మహేష్‌.. దారిలోనే రవితేజ కూడా!
Advertisement
Ads by CJ

సాధారణంగా మన స్టార్‌హీరోలు వేళ్లపై లెక్కపెట్టగల కొన్ని చానెల్స్‌, పత్రికలకు మాత్రమే ఇంటర్వ్యూలు, ప్రకటనలు వంటివి ఇస్తుంటారు. కానీ అందరిని కలుపుకొని పోయి... అందరికీ ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వడం ద్వారా ఎంతటి ఉచిత ప్రచారం వస్తుందో ఇటీవల మహేష్‌బాబు స్వయంగా 'శ్రీమంతుడు'తో నిరూపించాడు. వాస్తవానికి మహేష్‌తో పాటు రవితేజ కూడా కేవలం సెలక్టెడ్‌గా మాత్రమే కొన్ని పత్రికలు, చానెల్స్‌, వెబ్‌సైట్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కానీ మహేష్‌ అందరినీ కలుపుకొని సాధించిన మంచి ఫలితాలను తెలుసుకున్న రవితేజ కూడా తన 'కిక్‌2' చిత్రానికి అందరినీ కలుపుకొని పోవడానికి నిర్ణయించి.. అడిగిన అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మొత్తానికి సక్సెస్‌ కోసం మహేష్‌ లాగానే రవితేజ కూడా మీడియాను వీలైనంతగా వాడుకోవాలని డిసైడ్‌ అయ్యాడంటున్నారు. మరి 'కిక్‌2'తో ఆయన ఎలాంటి విజయం సాధిస్తాడో వేచిచూడాల్సి వుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ