Advertisementt

ఫస్ట్ లుక్స్ తోనే అభిమానుల కోలాహలం!

Sun 16th Aug 2015 01:11 AM
pawan kalyan,sardhar,bobby,anushka,size zero,ntr  ఫస్ట్ లుక్స్ తోనే అభిమానుల కోలాహలం!
ఫస్ట్ లుక్స్ తోనే అభిమానుల కోలాహలం!
Advertisement
Ads by CJ

స్వాతంత్య్రదినోత్సవ కానుకగా పలు చిత్రాల ఫస్ట్‌లుక్స్‌ విడుదలయ్యాయి. ఇందులో స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించే చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాభిమానులకు ఇంతకాలానికి ఊరడింపు లభించింది. ఆయన చేస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంలోని లుక్‌ విడుదలై అత్యద్భుమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ లుక్‌ను చూసిన ఆయన అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఈ లుక్‌ని చూసి స్వయంగా పవన్‌కళ్యాణ్‌ కూడా ఎంతో ఎగ్జైట్‌ అయ్యాడంటూ దర్శకుడు బాబి ట్వీట్‌ చేశాడు. ఈ స్టిల్‌ను చూస్తుంటే 'గబ్బర్‌సింగ్‌' ఫీట్‌ను, మ్యాజిక్‌ను పవన్‌ మరోసారి రిపీట్‌ చేయనున్నాడంటూన్నారు. ఇక ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో ఎన్టీఆర్‌ గెటప్‌ను చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'టెంపర్‌' చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ లుక్‌, గెటప్‌ను చూస్తుంటే మరోసారి ఆయన తన అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ రెండు చిత్రాల గెటప్‌లతో పాటు విడుదలైన అనుష్క 'సైజ్‌జీరో'తో పాటు పలు ఇతర చిత్రాల లుక్స్‌ కూడా సినీ ప్రేమికులను అలరిస్తున్నాయి. మరి ఈ అన్ని సినిమాల లుక్స్‌లో ఎవరి లుక్స్‌ ఎంతగా ఆకర్షిస్తున్నాయనే విషయం ఆసక్తిని రేేకెత్తిస్తోంది...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ