Advertisementt

చిరు 150 కి 'ఆటో' పోయి 'కత్తి' వచ్చె!

Thu 13th Aug 2015 03:29 AM
chiranjeevi,150th movie,kaththi movie remake,tagore madhu,dil raju,auto johnny  చిరు 150 కి 'ఆటో' పోయి 'కత్తి' వచ్చె!
చిరు 150 కి 'ఆటో' పోయి 'కత్తి' వచ్చె!
Advertisement

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంపై రోజుకో వార్త షికారు చేస్తోంది. ఈ సస్పెన్స్‌ వీడాలంటే ఆయన బర్త్‌డే వరకు అంటే ఆగష్టు 22 వరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. అప్పుడు పూరీజగన్నాథ్‌తో 'ఆటోజానీ ' అన్నారు. మధ్యలో వినాయక్‌తో చర్చలు జరిగాయి. తాజాగా మరో చిత్రం తెరపైకి వచ్చింది. ఠాగూర్‌ మధు తమిళంలో మురుగదాస్‌-విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'కత్తి'చిత్రం రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని అనువాదం చేయాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత రీమేక్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌.. ఇలా అందరికీ చూపించాడు. ఎన్టీఆర్‌ ఈ చిత్రం చేయడానికి రెడీ అనే సంకేతాలు కూడా వచ్చాయి. దిల్‌రాజు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని అంతా భావించారు. అయితే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది నిజమే కానీ అది 'కత్తి' రీమేక్‌ కాదని, మరో కొత్త కథతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. తాజాగా ఠాగూర్‌ మధు, దిల్‌రాజులు కలిసి మెగాస్టార్‌ను 'కత్తి' రీమేక్‌కు ఒప్పించారని, చిరు 150వచిత్రం ఇదేనని అంటున్నారు. ఈ రీమేక్‌ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే చిరుకు పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని అంటున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం సందిగ్దం నెలకొందని అంటున్నారు. చిరు 150వ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్‌చరణ్‌ సొంతంగా నిర్మించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. మధ్యలో వచ్చిన ఠాగూర్‌ మధు, దిల్‌రాజులు ఎంటర్‌ అయ్యే సరికి కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతోందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే నిజమైతే పూరీ 'ఆటోజానీ' అటకెక్కినట్టే అంటున్నారు. ఏ విషయం చిరు బర్త్‌డే నాడు తేలనుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement