Advertisementt

100కోట్లు ఖాయం అంటున్నారు!

Tue 11th Aug 2015 09:12 AM
sreemanthudu,mahesh babu,bahubali,attharintiki daredi  100కోట్లు ఖాయం అంటున్నారు!
100కోట్లు ఖాయం అంటున్నారు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం పస్ట్‌ వీకెండ్‌తో పాటు సోమ, మంగళ వారాల్లో కూడా స్టడీగా ఆడుతూ హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. మొదటి వారానికి ఈ చిత్రం 70కోట్ల వరకు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం ' బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలు మాత్రమే ఉన్నాయి. 'బాహుబలి' పని కూడా ఖాళీ అయింది. ఇక ప్రేక్షకులందరికీ ఉన్న ఏకైక ఆప్షన్‌ 'శ్రీమంతుడు'నే అని చెప్పాలి. అందులో ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే.. ఈ చిత్రానికి యూత్‌ నుండి మరీ ముఖ్యంగా మహిళల నుండి మంచి స్పందన వస్తోంది. మరో రెండు వారాల వరకు మరో పెద్ద సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 'కిక్‌2' సంగతి ఇంకా సందిగ్దంలోనే ఉంది. ఇక సెప్టెంబర్‌ 4న 'రుద్రమదేవి' విడుదలయ్యే వరకు 'శ్రీమంతుడు'కు పోటీ లేదు. పైగా ఆగష్టు 15తో మరో వీకెండ్‌ సిద్దంగా ఉంది. వీటన్నింటినీ గమనిస్తే 'శ్రీమంతుడు' 'అత్తారింటికి దారేది'ని దాటడమే కాదు... వంద కోట్ల క్లబ్‌లో చేరనున్న రెండో చిత్రంగా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ