అనుష్క టైటిల్ రోల్‌లో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి' సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దమవుతోంది. కాగా దీనికి కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు-ది లాస్ట్ ఎంపరర్' టైటిల్‌ను ఆయన రిజిష్టర్ చేయించాడు. 'రుద్రమదేవి' సినిమా చివరలో తదుపరి చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు గుణశేఖర్. 'బాహుబలి'కి 'బాహుబలి2' ఉన్నట్లుగా 'రుద్రమదేవి'కి 'ప్రతాపరుద్రుడు'ని సీక్వెల్ తరహాలో ఆయన రూపొందించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో ప్రతాపరుద్రుడుగా మహేష్‌బాబును నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫీలర్లు వదిలాడు. ఈ ప్రాజెక్ట్ సాకారం కావాలంటే 'రుద్రమదేవి' పెద్ద హిట్ కావాలి. అది జరగకపోతే 'ప్రతాపరుద్రుడు' ఉండే అవకాశమే లేదు. మరి అన్ని గుణ అనుకున్నట్లు జరిగితే 'ప్రతాపరుద్రుడు'గా నటించబోయే మహేష్‌బాబు 'రుద్రమదేవి'కి మనవడు అవుతాడు..... మరి మహేష్ అభిమానులు ఏమంటారో చూడాలి...!




Loading..