Advertisementt

'శ్రీమంతుడు' పై సి.ఎం ల కన్ను!

Tue 11th Aug 2015 06:15 AM
sreemanthudu,mahesh babu,chandrababu nayudu,kcr  'శ్రీమంతుడు' పై సి.ఎం ల కన్ను!
'శ్రీమంతుడు' పై సి.ఎం ల కన్ను!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం మంచి మెసేజ్‌తో వచ్చి సూపర్‌హిట్టుగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఈ వారంలో ఎ.పి. సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చూడనున్నాడట. ఇందుకోసం గుంటూరు ఎంపీ, మహేష్‌ బావ గల్లాజయదేవ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. అలాగే మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో 'శ్రీమంతుడు' చిత్రాన్ని కేసీఆర్‌కు కూడా స్పెషల్‌ షో వేసి చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే తమ చిత్రాన్ని చూడమని ఈ చిత్రం యూనిట్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా ఆహ్వానించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంగ్లీషు లేదా హిందీ సబ్‌ టైటిల్స్‌తో మోడీకి ఢిల్లీలోనే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. సో... ఇవ్వన్నీ వర్కౌట్‌ అయితే ఈ చిత్రానికి మరింత క్రేజ్‌, మైలేజ్‌ వచ్చే అవకాశం ఉంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ