భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్దం!

Tue 11th Aug 2015 04:05 AM
hollywood warrior movie,brothers,ram charan,rana,prabhas  భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్దం!
భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్దం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్‌ హవా కొనసాగుతోంది. ఈసారి ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు హీరోలు కలిసి నటించడానికి సిద్దపడుతున్నారనేది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. హాలీవుడ్‌ సినిమా 'వారియర్‌' ఆధారంగా బాలీవుడ్‌లో 'బ్రదర్స్‌' అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే చాలు... ఈ చిత్రం సౌతిండియన్‌ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకొని ముగ్గురు స్టార్స్‌తో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ప్రబాస్‌, రానాలను నటింపజేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య, కార్తి, విక్రమ్‌లతో కూడా తీయాలని, ఒకేసారి రెండు భాషల్లోనూ నిర్మించాలని ఆ కార్పొరేట్‌ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి బాలీవుడ్‌లో 'బ్రదర్స్‌' విజయం సాధిస్తుందో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కనుక ఓకే అయితే అదో సంచలనమే అవుతుందని చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ