Advertisement

'సర్దార్‌' సత్తా మొదలైంది!

Mon 10th Aug 2015 03:59 AM
  'సర్దార్‌' సత్తా మొదలైంది!
'సర్దార్‌' సత్తా మొదలైంది!
Advertisement

'గబ్బర్‌సింగ్‌2' బదులుగా 'సర్దార్‌'గా మారిన పవన్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సత్తా ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. నిన్నటివరకు అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందా? లేదా? అనే సందిగ్దంలో అందరూ ఉన్నారు. కానీ ఎట్టకేలకు 'సర్దార్‌'లో పవన్‌ జాయిన్‌ అయ్యాడు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్‌ చేశాడు. ఈ లుక్‌ను స్వయంగా పవనే డిజైన్‌ చేయించాడని సమాచారం. ఈ చిత్రానికి బాబి కేవలం పేరుకే డైరెక్టర్‌ అని.. అన్ని విషయాలను పవనే దగ్గరుండి నడిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో తన సరసన ఆయన కాజల్‌ అగర్వాల్‌ను పెట్టుకున్నాడని అంటున్నారు. కాగా ఈ చిత్రం అలా మొదలైందో లేదో ఇటు బిజినెస్‌పరంగా పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఆఫర్స్‌తో బయ్యర్లు క్యూ కడుతున్నారని, ఇప్పుడు బిజినెస్‌ చేసినా ఈ చిత్రం 100కోట్ల బిజినెస్‌ను సాధించడం ఖాయం అని సమాచారం. అయితే పవన్‌తో పాటు నిర్మాత అయిన ఆయన స్నేహితుడు శరత్‌మరార్‌లు మాత్రం సినిమా విడుదలకు చాలా రోజుల ఉందని, వచ్చే వేసవిలోనే ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఇప్పుడే బజినెస్‌ పరంగా ఎవ్వరికీ హామీలు ఇవ్వకూడదని డిసైడ్‌ అయ్యారట. సో... 'సర్ధార్‌' చిత్రం బిజినెస్‌పరంగా సంచలనాలకు వేదిక కానుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement