Advertisementt

'రుద్రమదేవి'కి పోటీగా ఆ చిత్రం నిలుస్తుందా!

Sat 08th Aug 2015 05:00 AM
rudhramadevi,gunasekhar,vishal,jayasurya movie  'రుద్రమదేవి'కి పోటీగా ఆ చిత్రం నిలుస్తుందా!
'రుద్రమదేవి'కి పోటీగా ఆ చిత్రం నిలుస్తుందా!
Advertisement
Ads by CJ

తమిళంలో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న తెలుగువాడు విశాల్‌. ఆయన నటించే చిత్రాలు పక్కా మాస్‌ చిత్రాలు కావడంతో ఆయన సినిమాలకు తెలుగునాట కూడా బాగానే క్రేజ్‌ ఉంది. తాజాగా విశాల్‌ సుశీంద్రన్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగులో 'జయసూర్య'గా రానుంది. ఈ చిత్రాన్ని తమిళంలో 'పాయుమ్‌ పులి' అనే టైటిల్‌ పెట్టగా తెలుగు వెర్షన్‌కు 'జయసూర్య' అని టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఇందులో విశాల్‌కు జోడీగా కాజల్ నటించనుంది. ఈ చిత్రంలో విశాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 4న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అదే రోజున గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని కూడా అదే రోజున తమిళంలో కూడా విడుదల చేయాలని గుణశేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మరి 'రుద్రమదేవి' ధాటికి విశాల్‌ 'జయసూర్య' తట్టుకోగలదా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ