వంశీ పైడిపల్లి ది మళ్లీ కాపీ మూవీయేనంట!

Thu 06th Aug 2015 04:12 AM
vamsi paidipalli,pvp,nagarjuna,karthi,tamanna,yevadu,the intouchables  వంశీ పైడిపల్లి ది మళ్లీ కాపీ మూవీయేనంట!
వంశీ పైడిపల్లి ది మళ్లీ కాపీ మూవీయేనంట!
Advertisement
Ads by CJ

హాలీవుడ్‌ సినిమా 'ఫేస్‌ఆఫ్‌'ను దర్శకుడు వంశీ పైడిపల్లి రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో 'ఎవడు'గా తీసి విజయం సాధించాడు. తాజాగా ఆయన మరోసారి అదే పని చేస్తున్నాడు. ఈసారి ఫ్రెంచ్‌ సినిమాను వాడేస్తున్నాడు. నాగార్జున, కార్తీల కాంబినేషన్‌లో వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్‌ సినిమాను 'ది ఇన్‌ టచ్‌బుల్స్‌' అనే ఫ్రెంచ్‌ మూవీని కాపీ కొట్టి తీస్తున్నాడని ఇటీవల విడుదల చేసిన నాగార్జున వీల్‌చైర్‌లో ఉన్న ఫొటోనిబట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతవరకు ఆ చిత్రం విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని అర్థమైంది. ఈ చిత్రంలో ఓ ధనవంతుడు, అప్పుడే జైలు నుండి విడుదలైన ఓ ఖైదీ కథ ఇది. యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి వీల్‌చైర్‌కే పరిమితమైన ఓ ధనవంతుడు ఓ కేర్‌టేకర్‌ను నియమించుకుంటాడు.అలా ఈ చిత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. మరి 'ఎవడు'లాగానే ఈ చిత్రాన్ని కూడా వంశీపైడిపల్లి తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తనదైన శైలిలో తీసి మెప్పిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ