Advertisementt

నిజంగా అఖిల్‌ కు అంత రేంజ్‌ ఉందా?

Tue 28th Jul 2015 10:07 AM
akkineni akhil,naga chaitanya,nagarjuna,vinayak,nithin  నిజంగా అఖిల్‌ కు అంత రేంజ్‌ ఉందా?
నిజంగా అఖిల్‌ కు అంత రేంజ్‌ ఉందా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నితిన్‌, ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి నిర్మాతగా నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్‌ వినాయక్‌ దర్శకత్వంలో హీరోగా తన తొలి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య విషయంలో జరిగిన తప్పును మరలా రిపీట్‌ కాకుండా చేయడానికి నాగ్‌ ఈ చిత్రం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాగా అఖిల్‌ తొలి చిత్రం ఇప్పటివరకు 40కోట్ల బిజినెస్‌ చేసిందని, సినిమా పూర్తయి, రిలీజ్‌ అయ్యే సమయానికి అఖిల్‌ బిజినెస్‌ రేంజ్‌ 50కోట్లు దాటుతుందని అంటున్నారు. వాస్తవంగా అక్కినేని నాగార్జున బిజినెస్‌ రేంజ్‌ 15 కోట్ల నుండి 20కోట్ల మద్య ఉంటుంది. అదే నాగచైతన్య రేంజ్‌ 10 నుండి 15కోట్లు మాత్రమే. అయితే మొదటి సినిమాతోనే అఖిల్‌ 50కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి అక్కినేని ఫ్యామిలీలో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చని అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ