మరో మెగాహీరో సినిమాలో శ్రీకాంత్‌!

హీరో శ్రీకాంత్‌కు మెగాకుటుంబంతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవితో, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించాడు. స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి శ్రీకాంత్‌ నా తమ్ముడు అని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. శ్రీకాంత్‌ కూడా చిరంజీవిని గౌరవంగా అన్నయ్యా అని పిలుస్తుంటాడు. తాజాగా ఆయన మరో మెగాహీరో బన్నీ సినిమాలో కీలకపాత్రను పోషించనున్నట్లు సమాచారం. త్వరలో అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రను చేయడానికి శ్రీకాంత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ఎలాంటి పాత్ర చేయనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే....! 

srikanth
allu arjun
chiranjeevi
boyapati srinu
geetha arts