'జేమ్స్ బాండ్' లో అనుష్క చేసివుంటే..?

Mon 27th Jul 2015 02:30 AM
jamesbond,anushka,allari naresh,sakshi chaudhary,anil sunkara  'జేమ్స్ బాండ్' లో అనుష్క చేసివుంటే..?
'జేమ్స్ బాండ్' లో అనుష్క చేసివుంటే..?
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో స్వీటీ అనుష్క ఎక్కువగా పెర్ఫార్మెన్స్‌ ఉండే పాత్రలే చేస్తోంది. 'బాహుబలి 1'లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా సెకండ్‌పార్ట్‌ మొత్తం ఆమె చుట్టూనే సినిమా తిరగనుంది. అలాగే ఆమె చేసిన 'రుద్రమదేవి' చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్దమవుతోంది. అలాగే 'సైజ్‌ జీరో' చిత్రం కూడా షూటింగ్‌ పూర్తిచేసుకుంది. మరి ఇంతలా బిజీగా ఉన్న అనుష్కను ఓ నిర్మాత, హీరో డేర్‌ చేసి ఓ చిత్రంలో నటించమని అడిగారట. కానీ ఆమె నో అంది. అదిమరేదో కాదు.... అల్లరినరేష్‌, సాక్షిచౌదరి జంటగా ఇటీవల విడుదలైన 'జేమ్స్‌బాండ్‌' చిత్రం. ఇందులో హీరోయిన్‌ది కీలకపాత్ర కావడం, అందులోనూ ఆమెకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉండటంతో ఆపాత్రను పోషించమని అనుష్కని అడిగారట. కానీ ఆమె నో చెప్పేసింది. దాంతో యూనిట్‌సభ్యులు వేరే మార్గం లేక సాక్షిచౌదరిని పెట్టుకున్నారు. మరి ఈ చిత్రంలో అనుష్క నటించి ఉంటే ఈ చిత్రానికి వచ్చే క్రేజ్‌ అద్భుతంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్లు లేక ఫ్లాప్‌ టాక్‌తో నడుస్తోందని అంటున్నారు. కాగా అనుష్కను ఈ చిత్రంలో చేయమని అడిగినట్లు స్వయాన నిర్మాత అనిల్‌సుంకర తెలిపాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ