Advertisementt

బన్నీకి అలాంటి కథ కావాలంట!

Sun 26th Jul 2015 09:55 AM
allu arjun,boyapati srinu,sports theme,bunny,rajamouli  బన్నీకి అలాంటి కథ కావాలంట!
బన్నీకి అలాంటి కథ కావాలంట!
Advertisement
Ads by CJ

ప్రతి సినిమాలోనూ తన లుక్‌ను, పాత్రల సెలక్షన్‌లో వేరియేషన్స్‌ను చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌. ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ బేనర్‌లో చేయబోయే నూతన చిత్రం జులై 26నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా అల్లుఅర్జున్‌ ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన మాట్లాడుతూ... నాకు క్రీడలంటే చాలా ఇష్టం. సినిమాల తర్వాత ఇష్టమైన రంగం అంటే స్పోర్ట్‌ అనే చెప్పాలి. ఓ మంచి స్పోర్ట్స్‌ కథతో నా దగ్గరికి వస్తే సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే. కానీ కథ మాత్రం చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలి.. అంటున్నాడు. అంటే రాజమౌళి నితిన్‌తో రగ్బీ నేపథ్యంలో తీసిన 'సై'లాగా ఉండాలన్నమాట...!మరి ఏ దర్శకుడు అలాంటి సబ్జెక్ట్‌తో వెళ్లి బన్నీ డేట్స్‌ దొరకబుచ్చుకుంటాడో చూద్దాం!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ