Advertisementt

మహేష్‌బాబు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాడా!

Sun 26th Jul 2015 09:36 AM
srimanthudu,mahesh babu,mahesh babu fans,india today  మహేష్‌బాబు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాడా!
మహేష్‌బాబు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాడా!
Advertisement
Ads by CJ

'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్‌లో మహేష్‌బాబు బాగా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. లాస్ట్‌ టైమ్‌ మిమ్మల్ని నిరుత్సాహపరిచాను. ఈసారి మాత్రం హిట్టుకొట్టడం ఖాయం అన్నట్లు మాట్లాడాడు. అయితే 'శ్రీమంతుడు' విషయంలో మహేష్‌కి కొద్దికొద్దిగా కాన్ఫిడెన్స్‌ తగ్గుతోందని అతని మాటలను బట్టి తెలుస్తోంది. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చిన మహేష్‌... 'శ్రీమంతుడు' విషయానికి వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. మంచి సినిమా చేశాం. కానీ జనాలకు ఎక్కాలి కదా..! ఒక్కసారిగా వాళ్లకు నచ్చేయడానికి ఇది మాస్‌ సినిమా కాదు. అందుకే కాస్త టెన్షన్‌గా ఉంది .. అంటూ సెలవిచ్చాడు ఈ మిల్కీబాయ్‌. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ని కాస్త గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇది మాస్‌ సినిమా కాదు... దీని కథే వేరు అని చెప్పడం మహేష్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కానీ కాన్ఫిడెన్స్‌ లేని మాటలు సినిమాపై లేనిపోని డౌట్లు సృష్టిస్తుంటాయి. తాజాగా ఈ కామెంట్లు కూడా ఆ కోవకే చెందుతాయి. ఇదిలా వుంటే మహేష్ ఫాన్స్ మాత్రం ఈ సారి పక్కా అంటూ మహేష్ లోనే ఆత్మవిశ్వాసంను నింపుతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ