Advertisementt

రమ్యకృష్ణ తమిళనాడు ముఖ్యమంత్రి!

Wed 22nd Jul 2015 11:14 AM
ramyakrishna,jayalalitha,bahubali,puracchithalaivi  రమ్యకృష్ణ తమిళనాడు ముఖ్యమంత్రి!
రమ్యకృష్ణ తమిళనాడు ముఖ్యమంత్రి!
Advertisement
Ads by CJ

నటిగా ఎప్పుడూ తన విశ్వరూపం చూపించే స్టన్నింగ్‌ బ్యూటీ రమ్యకృష్ణ నటన విషయంలో మొన్నటి ‘నరసింహ’ నుండి ఇవాల్టి ‘బాహుబలి’ వరకు ఏన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’లో శివగామిగా చేసిన ఆమె నటనకు టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. కాగా ఓ తమిళ దర్శకుడు ఎప్పటి నుండో తమిళనాడు ముఖ్యమంత్రి ‘పురచ్చితలైవి’ జయలలిత జీవితగాధను తెరకెక్కించాలని కష్టపడుతున్నాడు. అందుకోసం ఆయన ఎంతో కాలంగా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడట. ఇటీవల ఆ స్క్రిప్ట్‌ మొత్తం పూర్తయిందని, ఇక అందులో జయలలిత క్యారెక్టర్‌ను రమ్యకృష్ణ చేత చేయించాలని భావిస్తున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. ‘బాహుబలి’ చూసిన తర్వాత ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే న్యాయం చేస్తుందని భావిస్తున్నాడట ఆ దర్శకుడు. ఈ విషయమై ఆయన రమ్యకృష్ణకు కూడా కబురు పంపాడని, అయితే ఆ దర్శకుడు ఎవరు ? అనేది మాత్రం సస్పెన్స్‌ అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. మరి నిజంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కితే మాత్రం రమ్యకృష్ణ జయలలితగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ చూపించడం ఖాయమనే చెప్పవచ్చు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ