Advertisementt

బాహుబలి-2లో ప్రభాస్ వుంటాడా?

Wed 22nd Jul 2015 07:37 AM
bahubali,prabhas,rana,bahubali 2,ss rajamouli  బాహుబలి-2లో ప్రభాస్ వుంటాడా?
బాహుబలి-2లో ప్రభాస్ వుంటాడా?
Advertisement
Ads by CJ

ఇది వినడానికి విచిత్రంగా వున్నా... ఇగోలకు పోతే జరిగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఇది జరగకపోయినా.. ఒకవేళ జరుగుతుందేమోనని టెన్షన్.. ఇక అసలు విషయంలోకి వెళితే. ‘బాహుబలి’ సినిమా పబ్లిసిటి ట్రైలర్స్‌లో, కానీ ఇతర పబ్లిసిటిలో... మొదట్నుంచీ ప్రభాస్ కంటే ఎక్కువగా రానానే ఎక్కువగా ప్రమోట్ చేశారు. (ఆఫ్‌కోర్స్ ఇది నిర్మాతకు, రాజమౌళికి రానా తండ్రి సురేష్‌బాబు జారీ చేసిన హుకుం అనేది వేరే విషయం) అయితే  ఇదే విషయాన్ని ప్రభాస్‌తో జరిగిన ముఖాముఖిలో ఆయనతో మీడియా వాళ్లు ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని తనకు అలా అనిపించలేదని మాటను దాటేశాడు.కానీ  ఇప్పుడు ప్రభాస్‌కు తెలిసోస్తుంది. అసలే ‘బాహుబలి’ సక్సెస్ క్రెడిట్ మొత్తం జక్కన (రాజమౌళి) కొట్టేశాడని ప్రభాస్ అభిమానులు ఆవేదన చెందుతుంటే.. ఈ రానా కూడా తనకు అందినంత క్రెడిట్‌ను తన ఖాతాలో జమచేసుకోవాలని పబ్లిసిటిలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. అంతేకాదు ఇటీవల ఓవర్సీస్ నుంచి విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌లో ప్రభాస్ పేరు కూడా లేకపోవడం ప్రభాస్ కోపానికి కారణమైంది. వెంటనే నిర్మాతలకు ఫోన్ చేసి ‘బాహుబలి-2’ మీరే చేసుకోండి అంటూ కడిగి పారేశాడట. దీంతో దర్శక, నిర్మాతలు ఖంగుతిన్నారు. ఇక ఇప్పుడు  పబ్లిసిటి విషయంలో జ్ఞానోదయం కలిగిందో ఏమో ప్రభాస్  హడావుడిగా సొంత పబ్లిసిటిని మొదలుపెట్టాడు. నిన్న సింగిల్‌గా సుదర్శన్ థియేటర్‌కు వెళ్లిన ప్రభాస్ నేడు మీడియాతో పర్సనల్ ఇంట్రాక్షన్ కార్యక్రమం పెట్టుకున్నాడు.ఫైనల్‌గా ఏది ఏమైనా ‘బాహుబలి’ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే ‘బాహుబలి’ అని ఆయన అభిమానులు మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ