Advertisementt

రాజమౌళిని చూసి ఈర్ష్య పడుతోన్న దర్శకులు!

Tue 21st Jul 2015 07:45 AM
rajamouli,bahubali,poorijagannath,trivikram sreenivas  రాజమౌళిని చూసి ఈర్ష్య పడుతోన్న దర్శకులు!
రాజమౌళిని చూసి ఈర్ష్య పడుతోన్న దర్శకులు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో మన యువతరం దర్శకులందరికీ మంచి స్నేహబంధం ఉంది. వ్యక్తిగత కక్ష్యలు లేకుండా కేవలం స్పోర్టివ్‌గా ఒకరిని మించి మరొకరు భారీ హిట్స్‌ ఇవ్వాలనే తాపత్రయం తప్ప వీరి మధ్య పగలు, ప్రతీకారాలు ఉండవు. అలా స్పోర్టివ్‌గా ఉండేవారిలో పూరీ, రాజమౌళి, వినాయక్‌, శ్రీనువైట్ల, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి వారందరూ ఉన్నారు. అయితే సక్సెస్‌ పరంగా చూసుకుంటే ఎవరి స్టైల్‌ వారిది. ఒక్కోక్కరిది ఒక్కో దారి. రాజమౌళి విజువలైజేషన్‌, పూరీ క్యారెక్టరైజేషన్‌, త్రివిక్రమ్‌ పంచ్‌ డైలాగ్స్‌, వినాయక్‌ మాసివ్‌ ఇమేజ్‌..ఇలా ఎవరి ప్రత్యేకత వారిది. అయితే రాజమౌళి ‘బాహుబలి’ని మెచ్చుకుంటూ స్టార్‌ హీరోలందరూ స్పందిస్తున్నంతగా ఆయన  సాటి దర్శకులు మాత్రం రాజమౌళి కీర్తిని పొగడటం లేదు. మరి దీనికి ఏమి కారణం అనేది తెలియటం లేదు. మొత్తానికి వీరందరూ త్వరలో రాజమౌళి రికార్డ్‌ను బద్దలు చేయడం ఎలా? అనే విషయంలో పోటీపడుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి అదే వారి లక్ష్యమైతే టాలీవుడ్‌కు రానున్నవి మంచి రోజులే అని చెప్పాలి.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ