Advertisementt

బ్రహ్మీకి షాకిచ్చిన స్టార్‌రైటర్స్‌!

Tue 21st Jul 2015 04:04 AM
brahmanandam,dictator movie,kona venkat,gopimohan  బ్రహ్మీకి షాకిచ్చిన స్టార్‌రైటర్స్‌!
బ్రహ్మీకి షాకిచ్చిన స్టార్‌రైటర్స్‌!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో కమెడియన్‌ బ్రహ్మానందం హవా గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన ఏదైనా సినిమా ఒప్పుకొంటే రోజుకు 5లక్షల చొప్పున చార్జ్‌ చేస్తాడు. ఇంకా ఆయన పెట్టే కండీషన్లు బోలెడు. అయినా అందుకు మన నిర్మాత దర్శకులే కాదు.. చివరకు స్టార్‌హీరోలు కూడా ఆయన కోసం వెంపర్లాడుతుంటారు. అయితే ఇప్పుడిప్పుడే బ్రహ్మి హవాకు బ్రేకులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన న్యూటాలెంట్‌ కూడా బ్రహ్మీకి ఓ శాపంగా మారింది. సప్తగిరి, తాగుబోతు రమేష్‌, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ వరకు ఈమధ్య చాలామంది బ్రహ్మానందానికి గట్టి పోటీయే ఇస్తున్నారు. ఇక మన స్టార్‌ రైటర్లు కోనవెంకట్‌, గోపీమోహన్‌లకు బ్రహ్మీతో  మంచి అనుబంధమే ఉంది. అయినా వారు బ్రహ్మీతో వేగలేక ఆయనకు చెక్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. తాజాగా వీరిద్దరూ బాలకృష్ణ హీరోగా నటించనున్న 99వ చిత్రం ‘డిక్టేటర్‌’కు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ‘లౌక్యం’ డైరెక్టర్‌ శ్రీవాస్‌ దర్శకుడు. కాగా ఈ స్టార్‌రైటర్స్‌ ‘డిక్టేటర్‌’ చిత్రంలో బ్రహ్మానందం కోసం ఓ అద్భుతైన పాత్రను తీర్చిదిద్దారట. వాస్తవానికి బ్రహ్మీ కోసమే సృష్టించినప్పటికీ ఆయనతో వేగలేక కొత్తగా ట్రై చేయాలనే ఉద్ధేశ్యంతో ఆ పాత్రను పృథ్వీకి ఇవ్వడం జరిగిందని సమాచారం. మరి ఈపాత్రకు పృథ్వీ న్యాయం చేశాడంటే మాత్రం ఇక బ్రహ్మీకి కొన్ని బ్రేక్‌ లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ