Advertisementt

దిల్‌రాజును మించిపోతున్న సాయికొర్రపాటి!

Sat 18th Jul 2015 05:35 AM
dil raju,sai korrapati,rudhrama devi,allu arjun,anushka  దిల్‌రాజును మించిపోతున్న సాయికొర్రపాటి!
దిల్‌రాజును మించిపోతున్న సాయికొర్రపాటి!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో ఒకప్పుడు దిల్‌రాజు సినిమా హక్కులు తీసుకున్నాడంటే హిట్‌ గ్యారంటీ అనే నానుడి ఉండేది. ఇప్పటికీ అదే నానుడి సినిమా ఫీల్డ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు అదే రూట్‌లోకి మరో నిర్మాత వచ్చిచేరాడు. వారాహి చలన చిత్రం బేనర్‌ నిర్మాత సాయి కొర్రపాటి  ఓ సినిమాని తీసుకున్నాడంటే ఖచ్చితంగా హిట్‌ అంటున్నారు. దీంతో మిగతా ఏరియాల బిజినెస్‌ కూడా స్పీడ్‌గా జరిగిపోతోంది. తాజాగా ఆయన ‘రుద్రమదేవి’ చిత్రం కృష్ణా ఏరియా రైట్స్‌ తీసుకున్నాడని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఆ ఏరియాకు ఆయన రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించాడని తెలుస్తోంది. అల్లుఅర్జున్‌ చిత్రంలో కీలకపాత్రలో కనిపించడం, అనుష్క,రానాలు కూడా ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషించడంతో అవి సినిమాకు ప్లస్‌గా మారుతాయని భావించిన సాయి కొర్రపాటి ఆ రేటుకు ఓకే అని ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో మిగిలిన ఏరియాల బిజినెస్‌ కూడా ఇప్పుడు ఊపందుకొంది. సో... ఇప్పుడు దిల్‌రాజులాగే, సాయికొర్రపాటి సెంటిమెంట్‌ కూడా టాలీవుడ్‌లో బ్రహ్మాండంగా వర్కౌట్‌ అవుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ