Advertisementt

‘త్రిశూల వ్యూహం’ ఎక్కడి నుండి కాపీ కొట్టారు?

Fri 17th Jul 2015 07:02 AM
bahubali,ss rajamouli,alexander hollywood movie,trishula vyuham  ‘త్రిశూల వ్యూహం’ ఎక్కడి నుండి కాపీ కొట్టారు?
‘త్రిశూల వ్యూహం’ ఎక్కడి నుండి కాపీ కొట్టారు?
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఎక్కడవిన్నా హాట్‌టాపిక్‌ ‘బాహుబలి’ చిత్రమే. ముఖ్యంగా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కావడంతో ఇప్పుడు దేశం మొత్తం అదే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని సీన్లపై అంతటా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో హైలైట్‌గా నిలిచిన ‘త్రిశూల వ్యూహం’ హాలీవుడ్‌ చిత్రం ‘అలెగ్జాండర్‌’ నుండి కాపీ కొట్టారు అని ఆధారాలతో సహా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్లలో డిస్కస్‌ చేసుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం వీటిని ఖండిస్తున్నారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ఇలాంటి భారీ సినిమాకు ఇలాంటి రూమర్స్‌ అతి కామన్‌ అంటున్నారు. త్రిశూల వ్యూహం అనేది మహాభారతంలోనిది అని.. దాన్ని ‘అలెగ్జాండర్‌’ సినిమాలో కాపీ కొట్టారు అని వాదిస్తున్నారు. ఏది నిజం? అనేది ‘అలెగ్జాండర్‌’ చిత్రాన్ని, ‘బాహుబలి’ చిత్రాన్ని చూసి మహాభారతం చదివితే కానీ జడ్జిమెంట్‌ చేయలేం అంటున్నారు విశ్లేషకులు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ