Advertisementt

స్టోరీలేదని పరోక్షంగా ఒప్పుకొన్న రాజమౌళి!

Thu 16th Jul 2015 05:17 AM
rajamouli,bahubali,second part,bahubali first part  స్టోరీలేదని పరోక్షంగా ఒప్పుకొన్న రాజమౌళి!
స్టోరీలేదని పరోక్షంగా ఒప్పుకొన్న రాజమౌళి!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ చూసిన వాళ్లంతా మరీ అంతగా నివ్వెరపోకపోయినా మంచి సినిమానే తీశాడు అని రాజమౌళి విజువల్‌ థింకింగ్‌కి వీరతాళ్లు వేస్తున్నారు. విమర్శలకు మాత్రం ‘బాహుబలి’లో భావోద్వేగాలు  పండలేదని, కథ, కథనాల విషయాలను రాజమౌళి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. అవి..రాజమౌళి చెవికి చేరాయి. అందుకే... ‘బాహుబలి2’ ఇంకా బాగుంటుందని, మీ ఆకలిని పూర్తిస్థాయిలో తీరుస్తుందని అంటున్నాడు.  బలమైన కథ, కథనాలతో రెండో భాగాన్ని రూపొందిస్తాం. ఒక్క సంవత్సరం టైమ్‌ ఇవ్వండి. ఇంకా గొప్ప సినిమా తీసి మీ ముందుంచుతాం... అని అభిమానులకు మాటిచ్చేశాడు.  రాజు గారి మొదటి భార్య గుణవంతురాలు అంటే .. మరి రెండో భార్య...? అన్నచందంగా రాజమౌళి ‘బాహుబలి’ మొదటి పార్ట్‌లో బలమైన కథ, కథనాలు, భావోద్వేగాలు లేవని ఒప్పుకున్నట్లే అంటున్నారు. ఇక ‘బాహుబలి2’ వచ్చే ఏడాది ఇదే సమయానికి థియేటర్లలో ఉంటుందన్నమాట. ‘బాహుబలి1’ చూసి అర్థాకలితో ఉన్న అభిమానులంతా  అప్పటివరకు ఆగక తప్పదు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ