Advertisementt

రీమేక్‌ లకు రామ్‌..రామ్‌!

Wed 15th Jul 2015 07:58 AM
hero ram,masala movie,sravanthi ravikishore,premam movie  రీమేక్‌ లకు రామ్‌..రామ్‌!
రీమేక్‌ లకు రామ్‌..రామ్‌!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకుని తన అభిమానుల చేత ఎనర్జిటిక్‌ హీరోగా పిలవబడే హీరో రామ్‌. అయితే ఇటీవల ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్ని అపజయాలు వచ్చినా పట్టించుకోని రామ్‌ ‘మసాలా’ పరాజయంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. రీమేక్‌ కాబట్టి... అందునా వెంకటేష్‌ వంటి సీనియర్‌స్టార్‌తో చేస్తున్న చిత్రం కాబట్టి రామ్‌ ఆ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రామ్‌ ఇక రీమేక్‌ చిత్రాల జోలికి పోవడానికి భయపడుతున్నాడు. ఇటీవల తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్‌ అయి ధనుష్‌కు తెలుగులో మంచి క్రేజ్‌ను తీసుకొచ్చిన ‘రఘువరన్‌బి.టెక్‌.’ చిత్రం రీమేక్‌లో నటించమని ఈ చిత్రం హక్కులు తీసుకున్న స్రవంతి రవికిషోర్‌ మాటలను కూడా కాదన్నాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రవికిషోర్‌ ఈ చిత్రాన్ని డబ్బింగ్‌తో సరిపెట్టాడు. తాజాగా  మయళంలో సూపర్‌హిట్‌ అయిన ‘ప్రేమమ్‌’ రైట్స్‌ను కూడా ఆయన పెదనాన్నే దక్కించుకున్నాడు. ఈ రీమేక్‌లో అయినా నటించమని అడిగితే రామ్‌ తాను ఇక రీమేక్‌ చిత్రాలు చేయనని రవికిషోర్‌కు షాకిచ్చాడంట...! ఒక్క సినిమాకే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏమిటి? సినిమా అన్నాక హిట్లుఫ్లాప్ లు సహజమే కదా...! అని రామ్‌ శ్రేయోభిలాషులు అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ