Advertisementt

ఇలా అయితే ‘కిక్‌’ ఉండదంటున్నారు!

Tue 14th Jul 2015 05:59 AM
kick2,raviteja,surendar reddy,kalyan ram,ravi teja fans  ఇలా అయితే ‘కిక్‌’ ఉండదంటున్నారు!
ఇలా అయితే ‘కిక్‌’ ఉండదంటున్నారు!
Advertisement
Ads by CJ

రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘కిక్‌2’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత కొన్ని సీన్లు సరిగా రాలేదని మళ్లీ రీషూట్‌ చేస్తున్నారు. ఈ రీషూట్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటు కొన్ని పాటల  అవుట్‌పుట్‌ విషయంలో దర్శకుడు సురేందర్‌రెడ్డికి, నిర్మాత కళ్యాణ్‌రామ్‌కు సంతృప్తిగా లేదని, అందుకే కాంప్రమైజ్‌ కాకుండా రీషూట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హీరో రవితేజతోపాటు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా రీషూట్‌కు బాగా సహకరిస్తున్నారని సమాచారం. రవితేజ అభిమానులు సైతం ‘కిక్‌2’ సినిమా విడుదల విషయంలో కొన్నిరోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్‌ అయి చాలాకాలం అయింది. అయితే సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఎప్పుడో  వస్తూందనుకున్న ఈ సినిమా ఇలా వాయిదా మీద వాయిదాలు పడటంపై సగటు రవితేజ అభిమానులు సినిమా చూడాలనే ‘కిక్‌’ తమకు పోతోందని వాపోతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ