Advertisement

తెలుగు సినిమాకి దర్శకదీరుని దారి మంచిదేనా!

Tue 14th Jul 2015 01:31 AM
rajamouli,star heroes,telugu cinema,bahubali,ticket price hiking  తెలుగు సినిమాకి దర్శకదీరుని దారి మంచిదేనా!
తెలుగు సినిమాకి దర్శకదీరుని దారి మంచిదేనా!
Advertisement

సినిమాలకు మొదటివారం థియేటర్‌ రేట్లు పెంచుకొనే సౌలభ్యం చాలాకాలం నుండి కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంతో ఆయా చిత్రాలు మొదటివారం అద్బుతమైన కలెక్షన్లను రాబట్టుకొని వందకోట్ల క్లబ్బులో సులువుగా తమ పేరును లిఖించుకున్నాయి. తెలుగులో కూడా చాలాకాలం కిందట అంటే ‘భారతీయుడు’ టైమ్‌లో ఇలాగే కొన్ని చిత్రాలు మన రాష్ట్రంలో కూడా రేట్లు పెంచుకున్న సౌలభ్యాన్ని పొందాయి. కానీ ఆ తర్వాత ఆ విధానం వల్ల చాలా సమస్యలు, విమర్శలు చెలరేగడంతో ఇలా రేట్లు పెంచుకునే సాహసాన్ని మన స్టార్‌ హీరోలు పక్కనపెట్టారు. ఇప్పుడు రాజమౌళి తన ‘బాహుబలి’తో మరలా ఈ ట్రెండ్‌కు నాంది పలికి దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకొంటూ భారీ లాభాల దిశగా సాగుతున్నాడు. మొత్తానికి ఈ రేట్ల పెంపు అనే విషయంలో పిల్లి మెడలో గంటను రాజమౌళి అండ్‌ టీం కట్టింది. ఇదే పద్దతిని అనుసరించి ఉంటే పవన్‌కళ్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’, మహేష్‌బాబు ‘దూకుడు’, రామ్‌చరణ్‌ ‘మగధీర’ వంటి చిత్రాలు ఎప్పుడో వందకోట్ల క్లబ్బులో చోటు సంపాదించేవి. సరే... జరిగిందేదో జరిగిపోయింది. కాబట్టి ఇప్పటికైన  ఈ సదవకాశాన్ని వాడుకోవాలని మన స్టార్‌ హీరోలు ఉబలాటపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పద్దతి రెండంచుల కత్తితో సమానం. సాదారణంగా ప్రేక్షకులు ఫ్లాప్‌ సినిమాను టివి చానెల్స్‌లో చూసి సంతృప్తిపడుతుంటారు. యావరేజ్‌ సినిమాను 30రూపాయలు పెట్టి పైరసీ సీడీలో చూస్తుంటారు. హిట్‌ సినిమాకి మాత్రమే 100రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్‌కి వెళ్లి తమ ఉబలాటం తీర్చుకుంటారు. మరి థియేటర్ల రేటు పెంచారంటే ఖచ్చితంగా మంచి హిట్‌ సినిమాలే తీయాలి. లేకపోతే ప్రేక్షకులు కీలెరిగి వాత పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల యావరేజ్‌ అనిపించుకొనే చిత్రాలు.. రేట్ల పెంపు వల్ల తమ డబ్బుకు తగ్గ వినోదాన్ని అందించలేకపోతే ప్రేక్షకులు దాన్ని ఫ్లాప్‌ సినిమాగా మౌత్‌టాక్‌ తెస్తారు. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement