Advertisement

రాజమౌళి తక్షణ కర్తవ్యం ఏమిటి?

Mon 13th Jul 2015 10:25 AM
rajamouli,bahubali,bahubali part 2,ss rajamouli  రాజమౌళి తక్షణ కర్తవ్యం ఏమిటి?
రాజమౌళి తక్షణ కర్తవ్యం ఏమిటి?
Advertisement

సీక్వెల్స్‌ తీయడం చాలా కష్టమైన పని. మొదటి భాగాన్ని ఎక్కడ ముగించాలి..? సీక్వెల్‌కు ఎలా ఆరంభం ఇవ్వాలి? మొదటిభాగంలో అన్ని చెప్పేయకుండా విషయాన్నంతా సెకండ్‌పార్ట్‌ కోసం దాచుకుంటే ఏమవుతుంది? వంటి విషయాల్లో మన దర్శకులు విఫలం అవుతున్నారు. ‘బాహుబలి’ విషయంలోనూ అదే జరిగింది. సెకండ్‌పార్ట్‌ కోసం అన్ని దాచుకున్నప్పటికీ సెకండ్‌ పార్ట్‌ కథ ఏమిటో అందరికీ అర్థమైపోతోంది. అదే ఈ చిత్రాన్ని కేవలం ఒకే పార్ట్‌గా రెండున్నరగంటల్లో ఒద్దికగా చెప్పివుంటే ఈ చిత్రం రికార్డునే కాదు... దర్శకునిగా రాజమౌళికి పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చివుండేవి. అలా కాకుండా కేవలం సెకండాఫ్‌ కోసం స్టోరీని సాగదీసినట్లు కనిపిస్తోందంటే అది దర్శకుని తప్పిదమే. కాబట్టి ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌ వచ్చేలోగా జనాలు ఈ సినిమాను, అందులోని కథను, ట్విస్ట్‌ను మర్చిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్ట్‌ 2ను ఇంకా ఆలస్యం చేస్తే అది చాలా ప్రమాదకరం అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్‌పార్ట్‌లో మొదటిభాగంలో చేసిన తప్పు సరిదిద్దుకొని వెనువెంటనే రాజమౌళి రెండో పార్ట్‌ను కూడా విడుదల చేస్తే అప్పుడే ఆయన మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుంది. కానీ వేగంగా రిలీజ్‌ చేయాంటే అది వీలు కాని పనిగా తెలుస్తోంది. ఇప్పటికీ సెకండ్‌పార్ట్‌లో 40శాతం షూటింగ్‌ మిగిలేవుందని రాజమౌళి స్వయంగా తెలియజేశాడు. అది పూర్తి చేసి విడుదల చేయాలంటే అది ఈ ఏడాది చివరకు మాత్రమే సాధ్యం. మరి ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement