Advertisementt

ఇక అందరి చూపు మహేష్‌పైనే!

Mon 13th Jul 2015 06:43 AM
mahesh babu,srimanthudu,august 7,bahubali  ఇక అందరి చూపు మహేష్‌పైనే!
ఇక అందరి చూపు మహేష్‌పైనే!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ స్థాయిలో కాకపోయినా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’కు కూడా అంతటి క్రేజ్‌ ఉంది. ఆయనకున్న క్రేజ్‌కు యావరేజ్‌ సినిమాలు కూడా హిట్లుగా మారేంతగా ఆయన ఇమేజ్‌ రోజురోజుకు కొండలా పెరిగిపోతోంది. దీంతో ‘బాహుబలి’ తర్వాత అందరి చూపు ఆగష్టు 7న విడుదలయ్యే ‘శ్రీమంతుడు’పైనే ఉంది. అయితే ఈ చిత్రానికి ఉన్న ఒకే ఒక్క బలం, బలహీనత ఏమిటంటే... మహేష్‌బాబు గత రెండు చిత్రాలైన ‘1’ (నేనొక్కడినే), ‘ఆగడు’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో శ్రీమంతుడుపై అంచనాలు కొంత తగ్గి, ఎవ్వరూ ముందుగా అది ఇది అని అంచనాలు పెంచుకోకుండా సినిమా థియేటర్‌కు వెళ్లే చాన్స్‌లు ఉన్నాయి. ఈ చిత్రానికి కూడా థియేటర్ల పెంపుకు ప్రయత్నించి మొదటివారంలోనే రికార్డును తిరగరాయాలని మహేష్‌ స్కెచ్‌ వేస్తున్నట్లు సమాచారం. మరి మహేష్‌ కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ