Advertisementt

బాహుబలి పార్ట్ 2 వుంటుందా?

Sat 11th Jul 2015 06:07 AM
bahubali,bahubali result,bahubali part 2,ss rajamouli,doubts on bahubali part 2  బాహుబలి పార్ట్ 2 వుంటుందా?
బాహుబలి పార్ట్ 2 వుంటుందా?
Advertisement
Ads by CJ
>‘బాహుబలి’ సినిమాకు వచ్చిన హైప్, ఓవర్ పబ్లిసిటి ఆ సినిమా ఫలితంపై త్రీవ ప్రభావం చూపింది. విపరీతమైన అంచనాలతో థియేటర్‌కెళ్లిన ప్రేక్షకుడికి ‘బాహుబలి’ పూర్తి సంతృప్తినివ్వలేకపోయింది. ముఖ్యంగా కొన్ని వందలు వెచ్చించి టిక్కెట్ కొన్న ప్రేక్షకుడు ‘బాహుబలి’చిత్రం మోసం చేసిందనే భావనలో వున్నాడు.అయితే సినిమా ఫలితం చిత్ర దర్శక నిర్మాతలకు ముందే తెలిసి అత్యధిక ప్రారంభ వసూళ్లు కోసం తొలి రోజుల్లోనే సేఫ్ అవ్వాలనే ఉద్దేశంతోనే సినిమాకు వాళ్లు ఓవర్ హైప్ తీసుకొచ్చారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మొదటి పార్ట్‌ను అర్థాంతరంగా ముగించిన రాజమౌళి రెండో పార్ట్‌ను తెరకెక్కిస్తాడా? లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. తొలిపార్ట్‌కు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన కరువైంది కాబట్టి రెండో పార్ట్‌ను మళ్ళీ 100 కోట్లకు పైగా పెట్టుబడితో తీసే సాహసం చేస్తారా? లేక ఆలెడ్రీ షూట్ చేసిన సన్నివేశాలకు మరో కొన్ని రోజులు... తక్కువ పెట్టుబడితో చిత్రీకరణ చేసి జనాల పైకి ‘బాహుబలి-2’ను వదులుతారా? అనేది తెలియాల్సి వుంది. అయితే ‘బాహుబలి-2’ వచ్చే వరకు ప్రేక్షకులు ‘బాహుబలి-1’ స్టోరిని గుర్తుపెట్టుకుంటారా? లేక ‘బాహుబలి-2’ విడుదలకు ముందు ‘బాహుబలి’ని ఉచితంగా ప్రదర్శిస్తే బాగుంటుందని సినీ జనాలు కామెంట్ చేస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ