Advertisementt

రజనీ సంచలన వ్యాఖ్యలు!

Fri 10th Jul 2015 02:06 AM
rajanikant,mukund bothra,kasthoori raja,dhanush  రజనీ సంచలన వ్యాఖ్యలు!
రజనీ సంచలన వ్యాఖ్యలు!
Advertisement
Ads by CJ

సినీ ఫైనాన్షియర్‌ ముకుంద్‌ బోత్రాపై సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచన వ్యాఖ్యలు చేశాడు. తన నుండి డబ్బు గుంజడానికే తనపై దావా వేశాడంటూ మండిపడ్డాడు. తన వియ్యంకుడు కస్తూరిరాజా 65 లక్షలు ముకుంద్ బోత్రా వద్ద అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పుకు తాను హామీదారునిగా లేకపోయినా తన నుండి ఆ డబ్బు వసూలు చేయడానికి దావా వేశారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే పైనాన్షియర్‌ ముకుంద్‌ బోత్రా వాదన మరోలా ఉంది. రజనీ వియ్యంకుడు కస్తూరిరాజా 2012లో ఓ సినిమా విషయమై తన వద్దకు వచ్చి ఒక్కసారి 40లక్షలు, మరోసారి 25 లక్షలు తీసుకున్నాడని, తాను డబ్బు చెల్లించకపోతే తన కుమారుడు ధనుష్‌ మామగారైన రజనీకాంత్‌ చెల్లిస్తాడని చెప్పారని, అందుకే తాను దావా వేశానని ఆయన వాదిస్తున్నాడు. మరి ఈ సమస్య ఎటువైపు ముపుతిరుగుతుందో తెలియకుండా ఉంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ