Advertisementt

కళ్యాణ్‌రామ్‌కు కీలకంగా మారిన ఆగష్టు!

Wed 08th Jul 2015 01:53 PM
kalyan ram,share movie,patas,kick2,raviteja  కళ్యాణ్‌రామ్‌కు కీలకంగా మారిన ఆగష్టు!
కళ్యాణ్‌రామ్‌కు కీలకంగా మారిన ఆగష్టు!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లోనే నందమూరి కళ్యాణ్‌రామ్‌ అతి పెద్ద హిట్‌ను ఈ ఏడాది ‘పటాస్‌’ ద్వారా సాదించాడు. కాగా ఆయన తాజాగా నటిస్తున్న ‘షేర్‌’ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి మల్లికార్జున దర్శకుడు. సోనాల్‌చౌహాన్‌ ఇందులో కళ్యాణ్‌రామ్‌కు హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో బ్యాలెన్స్‌ ఉన్న ఒకే ఒక్కపాటను ఈనెల 11 నుండి మలేషియాలో చిత్రీకరించనున్నారు. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్‌ తానే నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై తొలిసారిగా బయటిహీరో రవితేజతో ‘కిక్‌2’ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్‌ దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం చేసి నేడు టాప్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘కిక్‌2’ చిత్రానికి అటుఇటుగా ‘షేర్‌’ విడుదల చేయనున్నాడు. ఈ రకంగా చూస్తే కళ్యాణ్‌రామ్‌కు హీరోగా, నిర్మాతగా ఆగష్టు నెల చాలా కీలకమైనది అని చెప్పవచ్చు. ‘షేర్‌’తో మరలా హిట్‌ కొట్టి ‘పటాస్‌’ విజయం గాలివాటంగా రాలేదని, అలాగే ‘కిక్‌2’ను కూడా అభిరుచికి తగ్గట్లుగా తీశాడనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది..!

 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ