ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
స్వాతిరెడ్డికి అవమానం!

స్వాతిరెడ్డి మెయిన్ పాత్రలో ప్రస్తుతం ‘త్రిపుర’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కాగా స్వాతికి తమిళ్, మలయాళంలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే స్వాతి కాస్త ఎక్కువగా ఆశపడింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా ఏకకాలంలో నిర్మించమని పట్టుబట్టిందట. దీంతో నిర్మాత దర్శకులు తమకిష్టం లేకపోయినా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌తో మంతనాలు జరిపారు. అయితే ఈ సినిమా హిట్ అయితే రీమేక్ రైట్స్ కొని సినిమాను హిందీలో పునర్నిర్మించడానికి సిద్దమే అని, అయితే స్వాతి బదులు మరో హీరోయిన్‌ను చూసుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో స్వాతి ఫీల్ అయినట్లుగా టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
swathi reddy
colors swathi
tripura movie
swathi tripura movie








































