Advertisementt

ఆ రెండు సినిమాలే ఆమెకు కీలకం...!

Thu 02nd Jul 2015 12:59 PM
lavanya tripathi,andala rakshasi,soggade chinni nayana,bhale bhale magadivoy  ఆ రెండు సినిమాలే ఆమెకు కీలకం...!
ఆ రెండు సినిమాలే ఆమెకు కీలకం...!
Advertisement
Ads by CJ

‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై సందడి చేసిన అమ్మడు లావణ్యత్రిపాఠి. తర్వాత ‘దూసుకెళ్తా’ లోనే నటించింది. కానీ ఆమెకు గొప్పఅవకాశం మాత్రం రాలేదు. నటిగా ఓకే గానీ, గ్లామర్‌ విషయంలో అత్తెసరు మార్కులే పడ్డాయి. ‘మనం’ చిత్రంలో  ఓ చిన్నపాత్రలో తళుక్కున మెరిసింది. లక్కీగా నాగ్‌ దృష్టిలో పడిరది. దీంతో లావణ్య లక్‌ తిరగబడిరది. ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో కుర్ర నాగార్జున సరసన హీరోయిన్‌గా చేస్తోంది. గ్లామర్‌ పాళ్లు ఎక్కువగా ఉన్న పాత్ర ఇది. ఇక మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్‌’లోనూ చోటు దక్కించుకొంది. రోజురోజుకు తన అందాలకు వన్నె తెస్తూ తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో మతులు పోగొడుతోంది. ఈ రెండు సినిమాలు విడుదలైతే లావణ్య లక్‌ దశ తిరిగినట్లే అని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ