సినిమా ధోని కి గాయం..!

క్రికెట్‌ మైదానంలో హెలికాప్టర్‌ షాట్‌ అనగానే మనకు ధోనీ గుర్తుకువస్తాడు. ధోని జీవిత కథతో బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌పాండే ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇందులో ధోనీ పాత్రను పోషిస్తున్నాడు. ‘ఎం.ఎస్‌.దోని` ది అన్‌టోల్డ్‌ స్టోరీ’అనేది ఈ చిత్రం టైటిల్‌. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల కూడా చేశారు. ఈచిత్రంలో సుశాంత్‌సింగ్‌ ధోని తొలినాళ్లలోని జులపాల జుట్టుతో కనిపించనున్నాడు. ధోనిలాగా హెలికాప్టర్‌ షాట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ సుశాంత్‌ గాయపడ్డాడు. ఆయన పక్కటెముకలకు గాయం అయిందని సమాచారం. సినిమాలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ 7వ నెంబర్‌ టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 

sushanth singh rajput
dhoni
helicopter shot
neeraj pandey