Advertisementt

బాలీవుడ్ లో రాజమౌళి కి నచ్చింది వీళ్ళే!

Thu 02nd Jul 2015 02:56 AM
ss rajamouli,salman khan,ameer khan,rajkumar hirani,bahubali,ajay devgan  బాలీవుడ్ లో రాజమౌళి కి నచ్చింది వీళ్ళే!
బాలీవుడ్ లో రాజమౌళి కి నచ్చింది వీళ్ళే!
Advertisement
Ads by CJ
>‘బాహుబలి’ ప్రమోషన్స్‌తో యమా బిజీగా ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో భాగంగా ఆయన కోలీవుడ్‌,టాలీవుడ్‌, బాలీవుడ్‌లను చుట్టేస్తున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమానికి ఆయన నిర్మాత కరణ్‌జోహార్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్బంగా మీడియా నుండి రాజమౌళికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక్కడ మీకు నచ్చిన హీరో ఎవరు? ఎవరితో సినిమా చేయాలనుంది? మీ అభిమాన దర్శకుడు ఎవరు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు జక్కన్న బాలీవుడ్‌ మీడియాకు సమాధానం ఇస్తూ... ‘కంపెని’ చూసి అజయ్‌దేవగణ్‌కు ఫేవరేట్‌ను అయిపోయాను. సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌’ చూసి ఆయనకు ఓ కథ సిద్దం చేయాలనిపించింది. ‘లగాన్‌’ చూసినప్పుడే ఎలాగైనా అమీర్‌ఖాన్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నాను... అంటూ సమాధానమిచ్చాడు. ఇక మీ అభిమాన డైరెక్టర్‌ ఎవరు? అనే ప్రశ్నకు ఆయన సమాదానమిస్తూ.. సూటిగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. దర్శకుడు రాజ్‌కుమార్‌హిరాణికి నేను పెద్ద వీరాబిమానిని. ఆతనే నా ఫేవరేట్‌ అన్నాడు రాజమౌళి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ