Advertisementt

‘బ్రహ్మోత్సవం’లో అందుకే చేయలేకపోతున్నాను!

Thu 02nd Jul 2015 02:46 AM
mahesh babu,brahmotsavam,rakul preet singh,ram charan jr ntr  ‘బ్రహ్మోత్సవం’లో అందుకే చేయలేకపోతున్నాను!
‘బ్రహ్మోత్సవం’లో అందుకే చేయలేకపోతున్నాను!
Advertisement
Ads by CJ
>మహేష్‌బాబు హీరోగా సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్లుగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈచిత్రం షూటింగ్‌ జులై 10న ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో మొదట సమంత స్థానంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను అనుకున్నారు. కానీ ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది. దాని గురించి తొలిసారిగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ.. మహేష్‌బాబు చిత్రం కోసం నేను డేట్స్‌ ఇచ్చిన మాట వాస్తవం. ప్రస్తుతం నేను రామ్‌చరణ్‌ సినిమాతో బిజీగా ఉన్నాను. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్‌ మూవీ మొదలవుతుంది. వీటి తర్వాత నెల డేట్స్‌ ఇచ్చాను. కానీ ‘బ్రహ్మోత్సవం’ టీం జులైలోనే డేట్స్‌ కావాలన్నారు. ఆ సమయంలో  ఈ రెండు చిత్రాలు మన దేశంలోనే షూటింగ్‌ జరుపుకుంటే మాత్రం డేట్స్‌ అడ్జస్ట్‌ చేయగలిగేదాన్ని, కానీ ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌ లండన్‌లో జరుగనుంది దీంతో జులైలో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక తప్పుకోక తప్పలేదు.. అని తెలిపింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ