Advertisementt

రామ్‌చరణ్‌ ‘చోటామేస్త్రీ’?

Mon 22nd Jun 2015 10:59 AM
ram charan,chota mestri,pawan kalyan,mega heroes,chiranjeevi,bengal tiger  రామ్‌చరణ్‌ ‘చోటామేస్త్రీ’?
రామ్‌చరణ్‌ ‘చోటామేస్త్రీ’?
Advertisement
Ads by CJ
>రామ్‌చరణ్‌ హీరోగా ‘రచ్చ’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంపత్‌ నంది మరలా రామ్‌చరణ్‌ కోసం ‘చోటామేస్త్రి’అనే టైటిల్‌తో మరో సబ్జెక్ట్‌ తయారు చేస్తున్నాడట. ప్రస్తుతం ఆయన రవితేజతో ‘బెంగాల్‌టైగర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే చరణ్‌కు ‘చోటా మేస్త్రీ’ స్టోరీ చెబుతానని సంపత్ నంది అంటున్నాడు. అలాగే పవన్‌కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనకు మంచి స్నేహితుడని, ఆయన తనకెప్పుడూ ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటాడని తెలియజేశాడు. తన జీవితంలో చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించడమే తన లక్ష్యం అని చెబుతున్న సంపత్‌ తాను మెగా ఫ్యామిలీకి ఎంతో రుణపడి ఉంటానని తెలిపాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ