Advertisement

ప్రభాస్‌ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా!

Fri 19th Jun 2015 03:06 AM
bahubali,prabhas,prabhas fans,ss rajamouli,bahubali part 2  ప్రభాస్‌ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా!
ప్రభాస్‌ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా!
Advertisement

‘బాహుబలి’ విడుదలైన వెంటనే ప్రభాస్‌ యువి క్రియేషన్స్‌ బేనర్‌లో సుజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడని అందరూ భావించారు. అయితే ఆలా భావించిన వారందరినీ ప్రభాస్‌ నిరాశ పరుస్తున్నాడు. ఒకవైపు సుజిత్‌ నుండి యువిక్రియేషన్స్‌ నుండి, అభిమానుల నుండి వస్తున్న ఒత్తిడిని కూడా కాదని ‘బాహుబలి2’ ని ముందుగా పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చాడట. ఒకేసారి  రెండు చిత్రాలను చేయడం ఇష్టంలేకపోవడంతోపాటు రాజమౌళి సైతం మొదట ‘బాహుబలి2’ని ఫినిష్‌ చేయమని కోరడంతో ప్రభాస్‌ కాదనలేకపోయాడని సమాచారం. ఇక ‘ బాహుబలి2’ విషయానికి వస్తే ఈ పార్ట్‌ కోసం ప్రభాస్‌ 40 నుండి 50రోజుల కాల్షీట్స్‌ ఇచ్చినట్లు  సమాచారం. ఆల్‌రెడీ ‘బాహుబలి2’ కి సంబంధించి ఇంకా 30శాతం షూటింగ్‌ పెండిరగ్‌ ఉందని రాజమౌళి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ 30శాతం షూటింగ్‌ను పూర్తి చేయడానికి రాజమౌళి ఎంత సమయం తీసుకుంటాడు? తమ హీరో మరలా డ్రీమ్‌బోయ్‌గా సుజీత్‌ చిత్రంలో ఎప్పుడు కనిపిస్తాడా? అని అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement