ఆకట్టుకుంటున్న పోస్టర్‌..!

Tue 16th Jun 2015 07:11 AM
shankarabharanam,nikhil,swamyrara,karthikeya,nanditha  ఆకట్టుకుంటున్న పోస్టర్‌..!
ఆకట్టుకుంటున్న పోస్టర్‌..!
Sponsored links

‘స్వామిరారా.. కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య’ వంటి చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకొని దూసుకుపోతున్న యంగ్‌ హీరో నిఖిల్‌ రచయిత కొనవెంకట్‌ నిర్మాణంలో ‘శంకరాభరణం’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ నందనవనం దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని కోన తన సోషల్‌ మీడియా సైట్‌ ద్వారా విడుదల చేశారు. ‘శంకరాభరణం’ అనే లోగో, హీరోహీరోయిన్లు నిఖిల్‌, నందితలు పరిగెడుతుంటే వెనక కొంతమంది రౌడీలు వెంటపడటం... ఇలా పోస్టర్‌ మంచి హైప్‌ క్రియేట్‌ చేసేలా ఉంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ అంజలి సైతం కీలకపాత్రలో నటిస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019