Advertisementt

మహేష్‌తో హ్యాట్రిక్‌ మూవీ చెయ్యడానికి రెడీ.!

Mon 15th Jun 2015 12:19 PM
heroine samantha,samantha in 5 tamil movies,samantha hatrick movie with mahesh  మహేష్‌తో హ్యాట్రిక్‌ మూవీ చెయ్యడానికి రెడీ.!
మహేష్‌తో హ్యాట్రిక్‌ మూవీ చెయ్యడానికి రెడీ.!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌తో ‘దూకుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందరి మెప్పు పొందిన సమంత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మరోసారి మహేష్‌తో జత కట్టి తమది హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. ఇప్పుడు మళ్ళీ మరోసారి మహేష్‌తో కలిసి ఓ సినిమా చెయ్యబోతోంది. ఆ సినిమా ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి వుంది. అయితే మహేష్‌తో హ్యాట్రిక్‌ మూవీ చెయ్యబోతోందన్నది సమాచారం. సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత తెలుగులో సినిమా లేని సమంత ప్రస్తుతం తమిళ్‌లో ఒకేసారి ఐదు సినిమాలు కమిట్‌ అయింది. తమిళ్‌లో విజయ్‌తో కలిసి చేసిన ‘కత్తి’ చాలా పెద్ద హిట్‌ అవ్వడంతో తమిళ దర్శకనిర్మాతల దృష్టి సమంతపై పడిరది. తెలుగులోలాగే తమిళ్‌లో కూడా చాలా సినిమాలు చేసిన సమంత ఒకేసారి ఐదు సినిమాల్లో కమిట్‌ అవడం మాత్రం విశేషమే. అయితే మహేష్‌తో సినిమా ఎప్పుడు చేస్తుందనే విషయంలో సరైన క్లారిటీ లేదు. పూరి జగన్నాథ్‌ ఆటోజాని తర్వాత చేసే సినిమా మహేష్‌దే. ఆ సినిమాలోనే మహేష్‌ సరసన సమంత నటించబోతోందన్నది విశ్వసనీయ సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ